**అల్లూరి జిల్లా కొయ్యూరు నడింపాలెం మండలం సెక్టర్ వంద రోజులు స్పెషల్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్

 


 అల్లూరి సీతారామరాజు జిల్లా  కొయ్యూరు మండలంలోని  వంద రోజులుగా  స్పెషల్ క్యాంప్ కార్యక్రమం  లో భాగంగా శుక్రవారం నాడు నడింపాలెం  సెక్టర్లో  అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి జిల్లా కలెక్టర్  దినేష్ కుమార్ ఆదేశాల ప్రకారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో గ్రామస్థాయిలో  అంగన్వాడీ కార్యకర్తల యొక్క  బాధ్యతల గురించి వివరించడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మహాలక్ష్మి అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు