కూటమి ప్రభుత్వం హామీ మొదటికే మోసం

కూటమి ప్రభుత్వం హామీ మొదటికే మోసం చేశారు - వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు.


అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు  వైసీపీ మండల నాయకులతో నిర్వహించిన మీడియా సమావేశంలో  మాట్లాడుతూ అధికార టీడీపీ, బీజేపీ, జనసేనా కూటమి పార్టీ ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం పథకం కింద ఎన్నికల ముందు మేనిఫెస్టో తో విడుదల చేసి ఇంట్లో ఎంత మంది చదువుకున్న పిల్లలు ఉంటే వారందరికీ రూ 15000 లు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే వర్తిస్తుందని మొట్ట మొదటి హామీతో రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు. మరియు మళ్లీ ఇంకొక హామీ ఎన్నికల ముందు ఉచిత ఇసుక చేస్తానని చెప్పి ఇప్పుడు టన్నుకి అధిక భారం మోపి ఇంకొక మోసం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు మీరిచ్చిన హామీలకు ఆకర్షితులై అధికారం పట్టం కట్టారు.  ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సీదరి రాంబాబు, జిల్లా కార్యదర్శి సీధరి మంగ్లన్న దొర, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు గబ్బడి చిట్టిబాబు, సర్పంచుల పోరం అధ్యక్షులు వనుగు బసవన్న దొర, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కిల్లు కోటి బాబు, కూడా సురేష్ కుమార్, సర్పంచులు వంతల రాంబాబు, కుర్రబోయిన సన్నీ బాబు, గొల్లోరి నీలకంఠం,  సోమిలి లక్ష్మణరావు, ఎంపీటీసీ కుంతురు నరసింహమూర్తి,  సీనియర్ నాయకులు శరభ సూర్యనారాయణ, రొబ్బ కృష్ణ రావు, తదితరులు పాల్గొన్నారు.