రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు నానా అవస్థలు


అల్లూరి సీతారామరాజు జిల్లా  కొయ్యూరు మండలం లో నిన్నటి నుండి భారీ వర్షం కురుస్తుంది. 



ఏకవీటిగా కురుస్తున్న భారీ వర్షాలకు, కొండ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొయ్యూరు నుండి  కృష్ణదేవి పేట  మీదుగా చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో  హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పెద్ద మాకవరం, రామరాజు పాలెం సమీపంలో ఉన్న రెండు  కొండ వాగులపై వంతెన నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో అక్కడ వేసిన తాత్కాలిక వంతెనలు  కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.