జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక ఐపిఎస్ ఆదేశాలమేరకు పకడ్బందీగా రాత్రివేళ గస్తీ విధులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు

 శ్రీకాకుళం జిల్లా

నేర నియంత్రణకు సిఐ దివాకర్ యాదవ్ బృందం పటిష్ట చర్యలు 


రాత్రి వేలల్లో గస్తి విధులు పటిష్ఠంగా నిర్వర్తించి అక్రమ రవాణ,నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఐపీఎస్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి పూట జిల్లా పోలీసు గస్తీ విధులలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించి, వాహన రికార్డ్స్, ప్రయాణికులను తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించి నేర నియంత్రణకు సిఐ దివాకర్ యాదవ్ బృందం పటిష్ట చర్యలు తీసుకుంటూ ,బీట్ తనిఖీ అధికారులు నిరంతరం బీట్ పాయింట్స్ తనిఖీ చేసి,ఆలయాలు, ఏటిఎంలు,వ్యాపార సముదాయాలు వద్ద సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించాలని తెలిపారు.