మీరు వద్దన్న సేవ చేస్తూనే ఉంటాం...అదే మా నైజం. మా గిడ్డి ఈశ్వరమ్మ నేర్పిన గుణం.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం సచివాలయం పరిధిలో పింఛను పంపిణీ కార్యక్రమం పండగల నిర్వహించారు. జనసేన బిజెపి టిడిపి కూటమి కార్యకర్తలు నాయకులు పాల్గొని గడపగడపకు వెళ్లి లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కొయ్యూరు మండల ఎస్ టి సెల్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జ్ జంపా వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్ పథకము ప్రవేశపెట్టింది శ్రీ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని మొట్టమొదటి సారిగా 35 రూపాయలు పించను పథకము తీసుకువస్తే తర్వాతే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు 75 రూపాయలు పెంచడం జరిగింది అని, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 200 రూపాయలు పించను అని చెప్పి 25 రూపాయలు ఇచ్చి పెంచుకుంటూ పోతామని చెప్పారు.
మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు ఉన్న పింఛను వెయ్యి ఆ తర్వాత 2000 వరకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని ఆ తర్వాత మూడు వేలు ఇస్తామని గద్దెనెక్కిన జగన్ రెడ్డి కూడా పెంచుతూ పోతాము అంటూ 250 ఇచ్చి పావలా కోడికి ముప్పావుల మసాలా అన్నట్టు ప్రచారం సాగించారు, మరల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే 4వేల రూపాయల పింఛన్ పై సంతకం చేయడం గొప్ప విషయం అని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న మొత్తం పించెన్ లో 2875 రుపాయలుTDP ప్రభుత్వంలో ఇచ్చినవే అని ఇందులో 2845 రూపాయలు ఒక్క చంద్రబాబు గారి హయాంలో పెంచినవే అని అన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఇచ్చిన మొత్తం కేవలం 11 25 రూపాయలు మాత్రమే అని, ప్రజలకు మంచి చేసే నాయకుడు ఎవరో ప్రజలే తెలుసుకోవాలని మరింతగా చంద్రబాబు గారి సారథ్యంలో మరింత సేవ చేసేందుకుగాను రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు చేస్తున్నటువంటి సంక్షేమంపై ప్రజా విశ్వాసం చాటుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు డివిడి ప్రసాద్ గారు. పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుమర్ల సాంబశివరావు గారు. సూపర్ సర్పంచ్ పనసల రాము. జనసేన కార్యకర్తలు జుర్రా ప్రకాష్. సుమర్ల రమణమూర్తి కూడా నరేష్ .గాం చిన్నబ్బాయి. తూబే సింహాచలం జంపా రమణమ్మ ఇతర నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు