విశాఖపట్నం
అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో అల్లూరి చిత్ర పటానికి నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్ పుష్పమాల వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 - 1924 మే 7) ఒక మహోజ్వల శక్తి అనీ అల్లూరి సీతా రామరాజు ప్రజల తరుపున నిల బడి వారిని చైతన్య పరిచి స్వాతంత్ర పోరాటం వైపు నడిపించి భారత దేశం స్వాతంత్ర సిద్దికి కృషి చేసిన వారిలో ఒకరని ఉద్ఘాటించారు. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయ మని కొనియాడారు అల్లూరి సీతారామరాజు ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయు లను ఉత్తేజపరచి వారిలో జాతీయతా భావాన్నీ దేశభక్తినీ పురి గొల్పాయని తెలిపారు ఈ కార్య క్రమం లో సిపీ తో పాటుగా జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కే.ఫక్కిరప్ప ఐపీఎస్,నగర పోలీసు ఉన్నతాధికారులు,కమిషనరేట్ సిబ్బంది,ఆర్ముడ్ రిజర్వు అధికారులు సిబ్బంది పాల్గొని మన్యం వీరుడు,విప్లవ పోరాట యోధుడు అల్లూరి సీతా రామరాజుకి నివాళులు అర్పించారు.