మాదిగ దండోరా - MRPS జెండా ఆవిష్కరణ కార్యక్రమం - జాన్ పేట, కైకలూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా
వర్గీకరణ మాదిగల చిరకాల స్వప్నం, దానిని నెరవేర్చడానికి మాదిగ దండోరా ద్వారా "మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి - MRPS" హక్కుల ఉద్యమం ఆవిర్భవించి జూలై 7 తో 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభినవ అంబేద్కర్, మహాజన నేత మందకృష్ణ మాదిగ అన్న ఆదేశానుసారం జూలై 7 ఆదివారం ఉదయం పార్టీలకతీతంగా జాన్ పేట గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి, మాదిగ దండోరా - MRPS జెండా ఆవిష్కరణ చేసి ఉద్యమానికి సంఘీభావ సభ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గ మాదిగ దండోరా - MRPS ఇంచార్జి విజయ్ వంగలపూడి మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంతో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి మాదిగ గ్రామంలో MRPS కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మాదిగ రిజర్వేషన్ల పోరాటాన్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాన్ పేట గ్రామ పెద్దలు శరత్ గోన, సతీష్ పిల్లనగ్రోవి, మదన్ కుమ్మరికుంట TDP పార్టీ నాయకులు వేల్పుల విజయ్, సునీల్ రాయినూతల, జాన్ పేట MRPS నాయకులు పిల్లనగ్రోవి అభ్రహాం, రాజేష్ పాలపర్తి, సురేష్ పాలపర్తి, యోహాను కొదమల, నాగేశ్వరరావు కొండిపోగు పాల్ల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
🙏 సామాజిక ఉద్యమాభివందనాలు 🙏
~ విజయ్ వంగలపూడి
MRPS - కైకలూరు ఇన్ఛార్జ్
మానవ హక్కుల కార్యకర్త
ఏలూరు జిల్లా.
కైకలూరు నియోజకవర్గ MRPS గ్రూప్ నందు జాయిన్ అవడానికి లింక్
https://chat.whatsapp.com/JxCQIft88F54gIvofm5hhJ
PH: 9492739099
FB: https://www.facebook.com/VangalapudiVijay