అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఎస్సై రామకృష్ణ రాబడిన సమాచారం మేరకు భీమవరం చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా రొంపులు ఘాటీ నుండి ఒక ఆటో కేడిపేట వైపు వెళుతుండగా సదరు ఆటోను తనిఖీ చేయగా ఆటోలో ఇద్దరు వ్యక్తులు రెండు గోనె సంచులల 60 కేజీల గంజాయిని తరలిస్తుండగా కొయ్యూరు ఎస్సై రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేయడమైనది.
సదరు అరెస్టు అయినా ముద్దాయిలలో కోరుకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మరియు చింతపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నారు. వారి వద్ద నుండి ఆటో మరియు 60 కేజీల గంజాయి మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసినట్లు కొయ్యూరు ఎస్సై రామకృష్ణ తెలిపారు