యాదాద్రి జిల్లా నూతన బదిలీ పై ఎసై అనిల్ కుమార్ గారికి ఆత్మీయంగ ఘన సన్మానం.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ సేవలు అమూల్యమైనవి.
మట్టిలో మాణిక్యం సుద్దాల ముద్దుబిడ్డకు ఆత్మీయంగా శుభాకాంక్షలు వెల్లువ.
మురిసిపోయిన స్వగ్రామస్తులు ఆనందంతో పరవశించిన తోటి ఉద్యోగులు.
ఈ సందర్భంగా సుద్దాల గ్రామ వాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ సేవలు అమూల్యమైనవని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎస్సైని కోరారు.ఈ కార్యక్రమంలో సన్మానించిన విద్యుత్ వినియోగదారులు గూడ తనేశ్ గౌడ్, తీగల రమేష్ గౌడ్, ఆలేరు పట్టణ కార్పెంటర్ అసోసియేషన్, మెంబర్ పడకంటి జంగచారి చెరుకూరి లక్ష్మయ్య,కల్మా రాజీ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సుద్దాల గ్రామ వాసిగా యాదాద్రి జిల్లాకు రావడం సంతోషావ్యక్తం అన్నారు. సుద్దాల వాసిగా ఔనత్యాన్ని ఉన్నతిని తెలంగాణ రాష్ట్రనికి చాటి చెప్పే విధంగా పనిచేస్తు ఇంకా ఉన్నత పదవులు పొందాలని యాదాద్రి లక్ష్మీ నర్శింహ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరారు. ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల అందరి భాగస్వామ్యం అవసరం అని అన్నారు.