డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి సమస్యల పరిష్కార దిశగా తోడ్పాటు ఇవ్వాలని తెలియజేసిన జాతీయ ఆర్ఎంపీ / పి ఎం పి సంఘాల సమైక్య అధ్యక్షులు కొండి సురేష్ బాబు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని మచిలీపట్నం నందు జరిగిన జన వాణి కార్యక్రమంలో హామీ ఇవ్వడం జరిగిందని అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ వైద్యులకు ఆగిన ట్రైనింగ్ క్లాసు లను తిరిగి ప్రారంభిస్తామని చట్టబద్ధత కల్పిస్తామని గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గ్రామీణ వైద్యులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నమ్మి సహాయ సహకారాలు అందించారని కూటమి ప్రభుత్వం విజయానికి ముఖ్య కారకులు గ్రామీణ వైద్యులు అని, గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కృషి చేయాలని కోరుతూ జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని జాతీయ ఆర్ఎంపీ / పి ఎం పి సంఘాల సమైక్య అధ్యక్షులు కొండి సురేష్ బాబు విజయవాడ నందు ఒక ప్రకటనలో తెలియజేశారు.