ఆరోగ్యమే మహాభాగ్యం...మన ఆరోగ్యం మన చేతుల్లోనే...
యాదాద్రి జిల్లా వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యుడు కాసం నాగేష్..
ఈ సందర్భంగా కాసం నాగేష్ వాకింగ్ గురుంచి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయాన్నే అరగంట మీరు వాకింగ్ చేయటం వలన ఆరోగ్యం బాగుపడుతుందని ఉదయాన్నే కాస్త పచ్చిగాలి శ్వాసిస్తూ చేసే వాకింగ్ ఎంతో ఉల్లాసం కల్గిస్తుందని చెప్పారు.
వాకింగ్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు శరీర బరువును సమంగా ఉంచుతుంది ఉత్సాహంగా ఉంచుకోగలుగుతారు మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది మానసిక స్థితిని బలపరుస్తుంది.శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది బీపీ బ్లడ్ ప్రసర్ నియాత్రణలో ఉంటుంది.కొన్ని క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది షుగర్ మధుమొహం వ్యాధి అదుపులో ఉంటుంది.ఎముకలను గట్టిగా దృడంగా చేస్తుంది.గుండెపోటు సమస్య రాకుండా కాపాడుతుంది.శరీర కండరాలను సమతులంగా చేస్తుంది.
మార్నింగ్ చేసే వాకింగ్ మనసుకు చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ వ్యాయామాలు చెయ్యండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.ఉదయం మరియు రోజంతా వాకింగ్ చేసిన తర్వాత మనసు ఉత్సవంగా ఉంటుందన్నారు.