సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్

ఈరోజు ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ, మానవ వనరులు అభివృద్ధి శాఖ, ఆర్టిజి శాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘ రాష్ట్ర మరియు జిల్లాల ప్రతినిధులు.



ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ చానల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం మరియు అందులో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా మంత్రి వారకి తెలియజేయడం జరిగింది మరియు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు ప్రభుత్వ పథకాలు అందే విధంగా సహాయ సహకారాలు అందజేయాలని కోరడమైనది మహారాష్ట్ర నందు యూట్యూబ్ జర్నలిస్టులను అక్కడి ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా క్రొత్త జీవోను పాస్ చేసి వారికి చేయుత నిచ్చింది అదే తరహాలో కూటమి ప్రభుత్వ హయాములో యూట్యూబ్ జర్నలిస్టులను కూడా గుర్తించి ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ తోడ్పాటును ఇవ్వాలని వివరంగా తెలియజేయగా మంత్రి నారా లోకేష్ వారు సానుకూలంగా స్పందించి కావలసిన ఏర్పాట్లు చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జై రాష్ట్ర అధ్యక్షులు యు వి రావు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మరియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం గురువారెడ్డి కోశాధికారి అప్పలరాజు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు దామోదర గోవిందు సూర్యనారాయణ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.