బుధవారం నాడు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ని పశ్చిమ నియోజకవర్గం యువత అధ్యక్షుడు మధుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వార్డు లో జరుగుతున్న దొంగతనలు , వార్డులో తలెత్తుతున్న సమస్యలపై, సి,సి కెమెరా ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన దొంగతనాలు అరికట్టడమే కాకుండా దొంగతనాలు చేసిన వారిని కటింగ్ శిక్షించే విధంగా ఉపయోగపడుతుందని కోరారు.
యువత (హెచ్ .పి. సీయల్)లో ఉద్యోగ అవకాశాలు గురించి చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే గణబాబు సానుకూలంగా స్పందించి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని తెలుపారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువత వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.