భారీ వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి!!

భారీ వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి....గుండాల ఏస్ ఐ సైదులు ఎచ్చరిక...



తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుండాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుండాల ఎస్ఐ సైదులు పిలుపునిచ్చారు, శనివారం ఆయన మాట్లాడుతూ ఈ వర్షాల కారణంగా ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో పూరి గుడిసెలలో నివసించకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు, అంతేకాక గుండాల మండల గ్రామాల్లో పాడుబడ్డ ఇండ్ల కింద తల దాచుకోవద్దని కరెంటు వైర్లు విద్యుత్ స్తంభాలు ప్రమాద భరితంగా కనిపిస్తున్న ఏ ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఈ వర్షాలకు తల దాచుకోకుండా వెనుక ముందు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు, ఈ వర్షాల కారణంగా పిడుగుపాటు వంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకుండా సాధ్యమైనంత వరకు భారీ వర్షాలు తగ్గేవరకు జాగ్రత్త వహించాలని అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు, ఈ భారీ వర్షాల కారణంగా గుండాల మండల మరియు ప్రాంత శివారులో ప్రజలను చైతన్యం చేస్తూ భారీ వర్షాలకు ప్రమాదాలను తెలుసుకోకుండా నివారించే దిశగా పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన సందర్భంగా అన్నారు, ప్రజల శ్రేయస్ కోసం పోలీసులు నిరంతరం ప్రజా సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరిస్తున్నామని ఇందులో భాగంగానే భారీ వర్షాల పట్ల కూడా పోలీసులు స్పందించడం జరుగుతుందని ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు,