సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు
కాగజ్ నగర్: సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరియు లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన మీదట కొత్తగా నిర్మించిన స్టేషన్ మాస్టర్ భవనం, ప్లాట్ ఫాం మరియు మౌలిక సదుపాయాల గురించి రైల్వే అధికారులతో చర్చించడం జరిగింది. మార్కెట్ వైపు ఉన్న రైల్వే బౌండరీ వాల్‌ను తొలగించాలని తద్వారా మార్కెట్ నుండి రైల్వే స్టేషన్ కు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని వారికి తెలియజేయడం జరిగింది. అలాగే కాగజ్ నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీ వద్ద మంజూరైన రైల్వే అండర్ బ్రిడ్జి పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ కైలాస్, భాజపా పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, రైల్ యాత్ర కమిటీ అధ్యక్షులు ప్రయాగ్ తివారీ, దెబ్బటి శ్రీనివాస్, వలుపదాసు రమేష్, మాచర్ల శ్రీనివాస్, మేడి కార్తీక్, పవన్ బల్దేవా, సౌరభ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.