ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఆంద్రా స్థానికత కలిగిన హోంగార్డ్స్ నాయకులు నారాయణ రెడ్డి, బుజ్జీబాబు, తదితరులు కలవడం జరిగింది. CM సానుకూలంగా స్పందించారు.
విషయం:-ఉమ్మడి రాష్ట్రంలో లో నియమించబడిన ఆంధ్ర ప్రదేశ్ స్థానికత కలిగిన హోంగార్డ్స్ ని స్వరాష్ట్రం అయిన ఆంద్రప్రదేశ్ కి బదిలీ చేయించగలరని మా యొక్క మనవి. అయ్యా!........మేము ఆంధ్ర స్థానికత కలిగిన తెలంగాణ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్. మేము గత 15సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డ్ విభాగంలో నియమితులైనము. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాసంబంధించినవార ము. తెలంగాణలోని మా హోంగార్డ్స్ విధులు నిర్వర్తిస్తున్నము. మా స్టడీ మొత్తం ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి చేసినాము. (1)అందుచేత మేము తెలంగాణా లో నాన్ లోకల్ గా పరిగణించబడుతున్నము. ఈ కారణంగా తెలంగాణ లో కానిస్టేబుల్ సెలెక్షన్స్ లో మేము హోంగార్డ్స్ కు ఇచ్చే వెసులుబాటు ను కోల్పోతున్నాము.(2). ఆంద్రప్రదేశ్ కానిస్టేబుల్ సెలెక్షన్స్ లో దరఖాస్తు పెట్టుకుంటే ,మీ సర్వీసు తెలంగాణ లో ఉంది కనుక ఆంధ్ర లో "కోటా" వర్తించదు అని చెపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లో మేము నష్టపోతున్నాము.(3). ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు కోల్పోతున్నాము.(4) మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారుతుంది. (5). ఎప్పట్నుంచో ఉన్న మా రేషన్ కార్డులను తొలగిస్తున్నారు. (6). AP ప్రభుత్వం హోంగార్డ్స్ కి ఇళ్ల స్థలాలు ఇచ్చి,దానిలోపక్కా గృహాలుకట్టిస్తుంది. ఇవి కోల్పోతున్నాము.(7). మా తల్లిదండ్రులు వృద్ధాప్యం లో వున్నారు.వాళ్లు ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు దగ్గరుండి మంచి,చెడు చూసుకోలేకపోతున్నాము. దీని తో మరింత మానసిక వేదనకు గురిఅవుతున్నాము. దయచేసి మా మనోవేదన ను అర్థం చేసుకుని మమ్మల్ని ఆంద్రప్రదేశ్ కు బదిలీ చేయవలసిందిగా మా యొక్క ప్రార్థన.
దయచేసి మా హోంగార్డ్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి... మేము చిన్న ఉద్యోగులం ... చాలీ చాలని రోజువారీ జీతం తో హైదరాబాద్ లాంటి సిటీలో ఎలా బ్రతుకుతాము. మా తల్లితండ్రులు, భార్యపిల్లలను విడిచి రోజులు తరబడి డ్యూటీ చేసి సొంత చార్జీలతో ప్రయాణం చేస్తున్నాము. రెండికి చెడ్డ రేవడిలా మా జీవితాలు తయారయ్యాయి. మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకోవడం వల్ల మీ గవర్నమెంట్ కి లాభం తప్ప నష్టమేమి లేదు. ఎందుకంటే Ap లో తెలంగాణా హోంగార్డులు 400 మంది పనిచేస్తున్నారు. వీళ్లని తెలంగాణా పంపి, మన హోంగార్డ్స్ ని ఇక్కడ కు రప్పించి మా జిల్లాలకు పంపితే సరిపోతుంది. గవర్నమెంట్ మీద ఎటువంటి బడ్జెట్ భారం పడదు. పైగా ఆ వచ్చిన వాళ్లు ప్రభుత్వం పై మంచి అభిప్రాయం తో అండగా ఉంటాము. కావున మా భాదను అర్థం చేసుకుని మా హోంగార్డ్స్ ఫైల్ ఒక్కసారి పరిశీలించి మాకు న్యాయం చేయండని చంద్రబాబు నాయుడు వారిని కోరడం జరిగింది. అతి త్వరలోనే లిస్ట్ లొ వున్న వారందరిని ఆంద్రా కు తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లొ నారాయణ రెడ్డి, బుజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.