పాఠశాలలు లేని గ్రామాల్లో స్పెషల్ ట్రైనింగ్

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఖాళీల వివరాలు...



మండలంలోని పాఠశాలలు లేని గ్రామాల్లో నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో ఎడ్యుకేషనల్ వాలంటీర్లుగా పనిచేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈఓ రాంబాబు తెలిపారు. జోగంపేట. కాకులమామిడి. కొమ్మనోడు. ఉసిరిక పాడు. బడ్డిమామిడి లంక. ఈదుల బంధ. గంపరాయి. వైఎన్ పాకలు. పుట్టకోట గ్రామాల్లో ఆరు నెలలు కాల పరిమితిలో పనిచేసేందుకు అభ్యర్థులు ఈనెల 13 లోగా ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని ఎంఈఓ రాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు.