అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు గుండాల ఎస్ఐ సైదులు.

గుండాల పోలీస్ ట్రాఫిక్ రూల్స్ ఆదేశాలతో నియమ నిబంధనలు. గుండాల మండల పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు గుండాల ఎస్ఐ సైదులు.



గుండాల మండల వాహనదారులకు విజ్ఞప్తి ప్రతీ వాహనదారులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్, RC, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపరాదు.మైనర్ లకు వాహనాలు ఇవ్వరాదు ఇచ్చినచో రైడర్ మరియు ఓనర్ మీద కేసులు పట్టణంలో రాంగ్ రూట్ లో డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేసినచో కేసులు నమోదుచేయబడును. వాహనాలపై ఉన్న పాత పెండింగ్ చలానలు విధిగా క్లియర్ చేసుకోగలరు లేనిచో వాహనాలు సీజ్ చేయబడును.పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతిలేదు ఆటోలలో పరిమితికి మించి ఎక్కించినచో కేస్ నమోదుచేసి ఆటో సీజ్ చేయబడును ఆటోలలో ట్రాక్టర్లు, ట్రాలీలలో లౌడ్ స్పీకర్లు ప్లే చేసినచో కేస్ నమోదు చేయబడును వాహనదారులు పోలీస్ వారికి సహకరించగలరు. ప్రజలు ఇట్టి నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నియంత్రణ పాటించి ప్రజలకు ఇబ్బంది కాకుండా అందరూ కూడా ఈ నిబంధనలు పాటించాలని కోరారు.అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లoగించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడుననీ చెప్పారు.