బాయ్స్ హాస్టల్ నందు పరివర్తన కార్యక్రమం

నేడు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో బాయ్స్ హాస్టల్ నందు మంప ఎస్సై లోకేష్ పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. 


అయితే ఈ సందర్భంగా ఎస్సై లోకేష్ మాట్లాడుతూ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, భోజనం బాగా పెడుతున్నారా, గంజాయి, సిగరెట్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. చిన్నపిల్లలు బైకులు నడపకూడదు అని ఎస్ఐ లోకేష్ పిల్లలకు పలు మంచి మాటలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ లోకేష్ తో   ప్రధానోపాధ్యాయులు డి. బాలమురళి కృష్ణ,  హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వేణు గోపాల్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.