చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తాం...ఎమ్మెల్యే పల్లా

 


గాజువాక:-చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పాత గాజువాక టీడీపీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లా మాట్లాడారు.గత వైసీపీ పాలనలో చేనేత రంగం అన్నింటా వెనకబడిందని తెలిపారు.ఈ రంగం పూర్తిగా అభివృద్ధి చెందడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.చేనేత కార్మికులను ఆదుకునేందుకు గాను రుణాల మంజూరుకు కావాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. దొడ్డి సత్యారావు, నామాల శ్రీకాంత్ అధ్యకతన పిల్లి చంద్రరావు శేఖర్, దేముడు పంపాన శ్రీనివాస్ ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం గాజువాక టీడీపీ కార్యాలయం లో జరిగింది.



ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా పల్లా శ్రీనివాస్ గారు చేనేత నేతలు పప్పు రాజారావు, నామాల సింహాచలం పప్పు శంకరరావు మాడెం అప్పారావు, బాబ్జి, దొడ్డి మల్లేష్, గిడుతూరి సన్యాసిరావు కోప్పల రమేష్, సత్యనారాయణ గారు పాల్గొన్నారు. 1905 లో స్వదేశీ ఉద్యమం రోజు జ్ఞాపకర్థం 2015 ఆగష్టు 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు. చేనేత ఉత్పత్తుల నాణ్యతను నిర్దారించడానికి "ఇండియా హడ్లూమ్ ముద్ర" ని ప్రవేశం పెట్టారు. రైతుల తర్వాత దేశంలో మానవలకి అత్యంత ప్రాముఖ్యమైనది నేత, అందువలన చేనేత బజారు లని ఏర్పాటు చేయాలనీ కోరారు. చేనేతలపై GST ని రద్దు చేయాలనీ కోరారు. చేనేతల కార్మికులకు రుణాలు మంజూరు చేయాలనీ కోరారు. నేతన్న నేస్త్రం అందచేయాలనీ కోరారు. Power ఛార్జిలను రద్దు చేసి ఉచితంగా అందిచాలన్నారు. చేనేతలకు కల్యాణ మండపం ఏర్పాటు చేయాలన్నారు.