మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాష్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు

మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాష్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్.


బాపట్ల పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు నరాలశెట్టి ప్రకాష్ జన్మదిన వేడుకలు నరాలశెట్టివారి పాలెం వారి స్వగృహంలో జన్మదిన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు.. బుధవారం మాజీ చైర్మన్ జన్మదినం పురస్కరించుకొని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్, మాజీ చైర్మన్ చేత కేక్ కటింగ్ చేయించి, దృశ్యాలవాతో పూలబొకేతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో చైర్మన్ గా అనేక సేవలందించి పట్టణ ప్రజలు మన్ననలను పొందుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకమని, ఆయన ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో పట్టణ ప్రజలు మధ్య జరుపుకోవాలని సురేష్ ఆకాంక్షించారు. అనంతరం వేదాంత డెవలపర్స్ కె.అనిల్ కుమార్ అలాగే ఆయనతోపాటు మూలిపిరి నాగరాజు, నక్కా వీరారెడ్డి, ఆదర్శనగర్ కిషోర్ కోటికలపూడి సురేష్ , తదితరులు నరాల శెట్టి ప్రకాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.