విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం ఆలుగుబిల్లిలో గ్రామంలో ఫించన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్.
జిల్లాలో జోరుగా సాగుతున్న ఎన్టీఆర్ సామాజిక పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు ఉదయం 6 గంటలకే ఆలుగుబిల్లి గ్రామ పంచాయతీ లో ఎన్టీఆర్ పింఛను కార్యక్రమం లో విజయనగరం జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్ మరియు శృంగవరపుకోట మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ లబ్దిదారులు ఇళ్ళవద్ద కే వెళ్లి, వృద్ధులు, వితంతువులుకు (నెలవారీ పెన్షన్ ₹4000) వికలాంగుల కు ₹6000 అందజేస్తామనే ఎన్నికలు హామీలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పింఛను పంపిణీ చేయడం జరిగింది అని రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఆలుగుబిల్లి సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.