సహజ సిద్ధ బొర్రా గుహలును కాపాడండి...

సహజ సిద్ధ బొర్రా గుహలును కాపాడండి...గుహలు పరిరక్షణకు చర్యలు చేపట్టండి..భారత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను నేడు మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించిన అరుకు పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) డా||గుమ్మ తనూజరాణి.



సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలును కాపాడాలంటు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను నేడు భారత పార్లమెంట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన అరుకు పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) డా||గుమ్మ తనూజరాణి. బొర్రాగుహలు పై నుంచి రెండో రైల్వే లైన్ వేసేందుకు, రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుందని, దింతో బొర్రా గుహలుకు పెనూ ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇప్పటికే గుహలు పై నుంచి మొదటి లైన్ ఉందని, ఇప్పుడు రెండో లైన్ వెయ్యడంతో చరిత్ర కలిగిన బొర్రా గుహలును కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా బొర్రాగుహలు మంచి గుర్తింపు పొంది, ఎంతో ప్రఖ్యాత గాంచిందని, అలాగే ఎందరో ప్రముఖులు సైతం బొర్రా గుహలు అందాలకు మంత్రముగ్దులైనట్లుగా ఈ సందర్భంగా వివరించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు కూలిపోతే గిరిజనులు మనుగడకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. బొర్రా గుహలుకు ఆధారపడి అనేక గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని విన్నమించారు. బొర్రా గుహలు పైనుంచి రెండో లైన్ వేసే ఆలోచన విరమించుకొని, 40 మీట్లర్ దూరంగా రెండో లైన్ వేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ జనరల్ మేనేజర్ తో చారవాణి ద్వారాగా మాట్లాడారు. ముందుగా ఆ యొక్క సమస్యను తెలుసుకొన్నారు. గుహలు పై నుంచి రెండో లైన్ మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అరకు పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) డా||గుమ్మ తనూజరాణి వెంట సహచర వైసిపి పార్టీ పార్లమెంట్ సభ్యులు మిధున్ రెడ్డి, గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.