బిజెపి ఎంపీ కంగనా రనౌత్ యొక్క అవమానకరమైన, తప్పుడు వ్యాఖ్యలను ఎస్ కే యం ఖండిస్తుంది-ఏపీ రైతు సంఘాల నేత, మాజీ మంత్రి వడ్డే..
విజయవాడ: తమ పార్టీ ఎంపీ చేసిన అత్యంత అభ్యంతకర ,అవాస్తవ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. కంగనా రనౌత్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎస్ కె ఎం డిమాండ్ చేసింది. లేదంటే రైతులు ఆమె బహిరంగ బహిష్కరణకు పిలుపునివ్వవలసి వస్తుంది. బిజెపి ఎంపి కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో చేసిన దిగ్భ్రాంతికరమైన అవమానకరమైన, తప్పుడు వ్యాఖ్యలను ఎస్కేయం ఖండిస్తూంది. రైతులను నిత్యం దుర్భాషలాడే ఈ ఎంపీ ఇప్పుడు భారతీయ రైతులను హంతకులు, రేపిస్టులు, కుట్రదారులు, దేశ వ్యతిరేకులు అంటూ పిచ్చి ప్రేలాపనలు చేయడం అత్యంత బాధాకరం. ఢిల్లీ సరిహద్దుల్లో ఎస్ కే యం నేతృత్వంలోని చారిత్రాత్మకమైన కార్పొరేట్ రైతుల వ్యతిరేక ఉద్యమాన్ని అవమానించడం, కించపరచడం, అప్రతిష్టపాలు చేయడం బీజేపీ చిరకాల విధానం కాబట్టి ఎస్కేయం ఇలాంటి మాటలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అవమానాలు, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినప్పటికీ, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక చట్టాలు, కార్పొరేట్ అనుకూల విధానాలకుహ వ్యతిరేకంగా రైతుల నిరసనలు శాంతియుతంగా, చట్టబద్ధంగా, భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులకు అనుగుణంగా ఎస్ కే యం ఎల్లప్పుడూ వ్యవహరిస్తూంది. రైతుల ఉద్యమం యొక్క అత్యంత ముఖ్యమైన విజయం దాని భారీ పాత్ర, 736 మంది అమరవీరుల అత్యున్నత త్యాగం. వారిలో నలుగురు రైతులపై లఖింపూర్ ఖేరీ హత్యాకాండలో ఐదుగురు బాధితులు, హత్య ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న కంగనా రౌనత్ పార్టీ నాయకుడు, మాజీ హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ టెని, అతని కుమారుడి వాహనాల కింద ఒక జర్నలిస్ట్ మరణించారు. రాజధాని చుట్టూ రైతాంగ పోరాటం సాగిన కాలంలో రైతుల ఉద్యమం వల్ల జరిగిన హింసాత్మక ఘటనలలో ఒక్కరు కూడా చనిపోలేదు. రైతుల ఉద్యమం బ్రిటిష్ వలసవాద, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా , భారత ప్రజలు జరిపిన పోరాటానికి వారసత్వ మే .ఇప్పటికీ సామ్రాజ్యవాద కనుసనల్లో నడిచే కార్పొరేట్ శక్తులు, విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. కంగనా రనౌత్ చరిత్ర, రాజకీయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. కంగనా రనౌత్ భారతదేశంలోని రైతుల ఉద్యమాన్ని దేశ వ్యతిరేకిగా పేర్కొనే ముందు దాని చరిత్ర, రాజకీయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. తన పార్టీకి చెందిన ఒక ఎంపీ చేసిన అసత్యమైన, అవాస్తవ వ్యాఖ్యలకుగాను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భారతదేశ రైతులకు క్షమాపణలు చెప్పాలని ఎస్ కే యం డిమాండ్ చేసింది. దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న వారి పట్ల తన పార్టీ, దాని సభ్యులు అనుచితంగా ప్రవర్తించడాన్ని అనుమతించకుండా, భారతదేశపు 'అన్నదాత'లకు ప్రధానమంత్రి అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది ప్రధానమంత్రి రాజ్యాంగ బాధ్యత . బిజెపి ఎంపి కంగనా రనౌత్ తక్షణమే తన అనుచితమైన, తప్పుడు ప్రకటనల కోసం భారతదేశ రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఆమె M.P స్ధాయి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఎస్ కె ఎం డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఎస్కేయం తన బహిరంగ బహిష్కరణకు పిలుపునివ్వడం తప్ప మరో మార్గం లేదు. ఎంపీ కంగనా రౌనౌత్ పై సుప్రీంకోర్టు సుమోటాగా కేసు స్వీకరించాలని ఒక ప్రకటనలో సోమవారం ఏపీ రైతు సంఘాల నాయకులు వై.కేశవరావు, కే వివి ప్రసాద్, సింహాద్రి ఝాన్సీ, చుండూరు రంగారావు, కొల్లా రాజమోహన్, డి హరినాథ్, మరీదు ప్రసాద్ బాబు, వెంకటరెడ్డి తదితరులు తీవ్రంగా ఖండించారు.