విశాఖపట్నంలో విద్యార్థులు రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా విడిపోయిన ఓ కాలేజీ స్టూడెంట్స్ బాజీ జంక్షన్ సమీపంలో పరస్పరం దాడి చేసుకున్నారు.
ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థుల గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.