తిరుపతి జిల్లా... భాకరాపేట ఘాట్లో బోల్తాపడ్డ లారీ: డ్రైవర్ మృతి



తిరుపతి జిల్లా, భాకరాపేట ఘాట్లో బుధవారం రాత్రి లారీ బోల్తాపడి డ్రైవర్ దుర్మారణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పీలేరు- తిరుపతి మార్గంలోని బాకర నారాయణ పేట సమీపంలోని ఘాటు రోడ్డు ఐదవ మలుపు వద్ద పీలేరు వైపు నుంచి తిరుపతి వైపు లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి లోయలో పడింది. ఈప్రమాదంలో వరదయ్య పాళ్యంకు చెందిన లేట్ గురవయ్య కుమారుడు చీమల నవీన్ (27) అక్కడి కక్కడే దుర్మారణం చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు