ఘాట్ లో రోడ్డు ప్రమాదం



అల్లూరి సీతారామరాజు జిల్లా  కొయ్యూరు మండలం  లో సోమవారం చింతలమ్మ ఘాట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపూడి గ్రామానికి చెందిన ఉల్లి చిన్నబ్బాయి  (45) బైకుపై సోమవారం  కృష్ణ దేవి పేట వైపు  బయలుదేరాడు. 



అయితే చింతలమ్మ ఘాట్  సమీపంలో వెళ్లేసరికి వాహనం అదుపుతప్పి  బోల్తా పడింది. చిన్నబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళుతున్న స్థానికులు  క్షతగాత్రుడిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి  తరలించారు.