బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, ముర్రు పాల ప్రాముఖ్యత గూర్చి వివరించిన కొయ్యూరు సిడిపిఓ విజయ కుమారి.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని గురువారం నాడు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, ముర్రుపాల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగిందని కొయ్యూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయ కుమారి తెలిపారు.
ఈ సందర్భంగా రామాపురం కేంద్ర పరిధిలో ఉండే బాలింత గృహ దర్శనం చేస్తూ వారికి తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతిరోజు తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య సూత్రాలు వివరించడం జరిగింది. అనంతరం మర్రిపాలెం కేంద్రంలో తల్లిపాల వారోత్సవం కార్యక్రమం నిర్వహించామని ఐసిడిఎస్ పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ తో పాటు మెడికల్ ఆఫీసర్, స్కూల్ టీచర్, సూపర్వైజర్ సునీత, కొండమ్మ, మహాలక్ష్మి, బాలమణి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.