మండే సూర్యునిలా ప్రజల గుండెల్లో కొలువైన పవర్ స్టార్

ప్రపంచాన్ని మనం చూడటం కాదు, ప్రపంచమే మనల్ని చూడాలి అనే విధంగా మండే సూర్యునిలా ప్రజల గుండెల్లో కొలువైన పవర్ స్టార్ జన్మదిన వేడుకలు రచయిత, దర్శకులు వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ నందు ఘనంగా జరపడం జరిగినాయి. 



ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. చిత్రం లో నటించిన నటీనటులను సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. పవన్ కళ్యాణ్ పాటలతో ప్రేక్షకులను స్వాతి, సాయి, సింధు, అలరించారు. ఈ కార్యక్రమంలో నాఇల్ మనోహర్ నాయుడు, గోళ్ళ నారాయణరావు డోగి పర్తి శంకర రావు, చిట్టిబాబు మాసాబత్తుల శ్రీనివాసరావు వేల్పూరి శ్రీనివాసరావు, డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు, డాక్టర్ కోలా విజయ్ శేఖర్, డాక్టర్ బండి రామా ఆంజనేయులు మొదలగు ప్రముఖుల సమక్షములో ఘనంగా జరిగిన తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా జరిగినది.