మెడ్ టెక్ యూనివర్సిటీని ప్రభుత్వమే నిర్వహించాలి -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకటరావు.
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మెడ్ టెక్ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. పిపిపి పద్ధతిలో వద్దు అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకటరావు అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరలోని నడుపూరు, పెద్దగంట్యాడ వద్ద గల గ్రీన్ ఫీల్డ్ గ్లోబల్ విశ్వవిద్యాలయంలో 2025 - 26 విద్యా సంవత్సరం నుంచి ఆ వర్సిటీలో ఉన్నత విద్యా కోర్సులలో అడ్మిషన్ ప్రారంభించే కృషి జరగడం మంచిదే కానీ ఆ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలోనే నిర్వహించాలని ప్రయత్నించడం అత్యంత ఆందోళనకరమైన విషయమని అన్నారు. దీనిలో నిర్వహించేవి అత్యంత ఖరీదైన కోర్సులు పీపీపీ విధానమైతే సామాన్యులు, బీసీ, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు లక్షల రూపాయలు ఫీజులు కట్టలేక యూనివర్సిటీ విద్యకు దూరం కావడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. మెడ్ టెక్ విశ్వవిద్యాలయం కోసం 2014 -2016 వ కాలంలో నడుపూరు, పెద్దగంట్యాడకు చెందిన వందలాదిమంది రైతులు 275 ఎకరాల భూమి కారు చవకగా ఇచ్చారు. ఆ భూములు పేద ప్రజలది, విశ్వవిద్యాలయం నిర్మాణ వ్యయం ప్రజలదే. వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలనద్ధి ప్రభుత్వం లక్ష్యమని, ఆ విశ్వవిద్యాలయంలో పరిశోధన, శిక్షణ, ఉద్యోగాలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ కృషికి ఫలితం ఉంటుందని అన్నారు.ఈ మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా పీపీపీ పద్ధతిలో నిర్వహించడం అనేది పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారుతుందని కావున మీ లాంటి అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి ఇటువంటి ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలను పలువురు మేధావులతో చర్చించి పేద, బడుగు, బలహీన వర్గాలకు కూడా న్యాయం అయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలని కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పూర్తిగా దృష్టి సాదించి వీలైనంత వరకు సామాన్యులకు అవకాశం కల్పించాలని ముఖ్యంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు వీటి విషయమై దృష్టి పెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకటరావు కోరుతున్నట్లు తెలిపారు.