బ్రహ్మ బాబా బోధనలతో పరమాత్మ సాక్షాత్కారం- బీ కే మోహిని
రాజస్థాన్ మౌంట్ అబూ: ప్రజా పిత బ్రహ్మ బాబా బోధనలు అనుసరించడం ద్వారా భగవంతుడిని దర్శించుకోవచ్చు అని బ్రహ్మ కుమారీస్ సంస్థ అదనపు పరిపాలనాధికారిణి బీ.కే.మోహిని పేర్కొన్నారు.
రాజస్థాన్ మౌంట్ అబూ నగరంలో ఉన్న బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ మీడియా సదస్సు ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సాంతితోనే సంతోషకరమైన జీవనం గడపోచ్చు అన్నారు. మనిషి అజ్ఞానం చీకట్ల వల్లనే దుఃఖమయ జీవనం గడుపుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. బీ కే నళిని మాట్లాడుతూ, భారత దేశం అభివృద్ధిలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. మానవులకు సంస్కారం, ఆత్మ శుద్ధి అవసరం అన్నారు.
బ్రహ్మ కుమారీస్ సంస్థ బోధనలు ద్వారా విశ్వ పరివర్తన సాధ్య మవుతుంది అన్నారు. బీ కే సంస్థ ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అన్నారు. బ్రహ్మ కుమారీస్ సంస్థ పత్రిక ఎడిటర్ గంగాధర్ మాట్లాడుతూ, మానవుడు ప్రకృతిని ఆరాధించాలి అని కోరారు. భగవద్గీత భక్తి మార్గం బోధిస్తుంది అన్నారు. ధ్యానంతో మనశ్శాంతి పొందొచ్చు అన్నారు. బ్రహ్మ కుమారీ సంస్థ ద్వారా రిలాక్స్, రీ ఫ్రెష్, రీ ప్లేస్ పొందొచ్చు అన్నారు.
డాక్టర్ సవిత మాట్లాడుతూ, ప్రపంచంలో సైన్స్, టెక్నాలజీ, పెరుగుతున్నా మానవుల జీవితం లో మనశ్శాంతి కరువవుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ పరివర్తన కు మీడియా ఆధ్యాత్మిక మార్గంలో కృషి చేయాలి అని కోరారు.పాఠశాలలో రాజయోగ బోధన ద్వారా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది అన్నారు. వ్యక్తిత్వం ద్వారా పరివర్తన సాధ్య మవుతుంది అన్నారు.ఈశ్వరేయ శక్తి ద్వారా మనోబలం పెరుగుతుంది అన్నారు. మీడియా వింగ్ వైస్ చైర్ పర్సన్ ఆతం ప్రకాష్ మాట్లాడుతూ, బ్రహ్మ బాబా బోధనలు ఈ తరం అనుసరించాలి అన్నారు.
జాతీయ మీడియా సదస్సు ను పాత్రికేయులు విజయ వంతం చేయాలి అని కోరారు. బ్రహ్మ కుమారీస్ సంస్థ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను దేశమంతా తెలిసేలా మీడియా కృషి చేయాలి అని కోరారు. ఆధ్యాత్మిక సాధికారత, ఆరోగ్య, సంతోష కర సమాజంలో మీడియా పాత్ర అంశం మీద ఇక్కడ నాలుగు రోజుల పాటు జరిగే జాతీయ మీడియా సదస్సు లో దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి సుమారుగా రెండు వేల మంది పాత్రికేయులు పాల్గొంటున్నారు. ప్రతి రోజూ పలు సెషణ్లు జరుగుతాయి అని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ విశాఖ పట్నం ప్రతినిధి రామేశ్వరీ ఆద్వర్యంలో విశాఖ నుంచి 42 మంది పాత్రికేయులు పాల్గొన్నారు.