సి పి ఎస్ ను రద్దు చేయండి... యూనియన్ జిల్లా నేత జయప్రకాష్ డిమాండ్.
కాoట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ను ( సి పి ఎస్) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను ( ఓ పి ఎస్) అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) జోగుళాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్దరించాల్సిన ప్రభుత్వం కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయకుండా యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ను (యు పి సి) తీసుకొనిరావడం పట్ల ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కాంట్రి బ్యూటర్ పెన్షన్ స్కీమ్ (సి పి ఎస్) విధానం వలన ఉద్యోగ విరమణ తరువాత ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. సి పి ఎస్, యు పి ఎస్ విధానం లను అమలు చేయకుండా, పాత పెన్షన్ స్కీమ్ నే తిరిగీ పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ డిమాండ్ చేశారు.