విశాఖపట్నం: విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఏ సి పి గా నియమితులైన సిహెచ్ పెంటారావును గురువారం ది కన్జ్యూమర్ రైట్స్ దక్షిణ భారత విభాగం కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నగర ప్రధాన కార్యదర్శి ఎం వి ఎస్ జి తిలక్ కలిసి శాలువా తో సత్కరించి అభినందనలు తెలియజేశారు. గతంలో పెంటారావు విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ లో ఏ సి పి గాను, నగరంలోని పలు పోలీస్ స్టేషన్లో క్రైమ్ విభాగంలోనూ, సిఐడి విభాగంలోనూ విధులు నిర్వహించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. సిహెచ్ పెంటారావు ఎక్కడ విధులు నిర్వహించిన అంకిత భావం, నిబద్ధత తో విధులు నిర్వహించి అక్కడ ప్రజలు, ఉన్నతాధికారుల ఆదరభిమానాలు పొందుతారని తిలక్ కొనియాడారు.