విశాఖపట్నం: ఈరోజు గురుపూజోత్సవం సందర్భంగా అక్కయ్యపాలెం రాం అకాడమీ ఆహ్వానం మేరకు ద్వారకా క్రైమ్ ఎస్సై ఎస్ రాజు, ఏఎస్ఐ ఎం సత్యనారాయణ పలువురు టిడిపి నాయకులు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్. ఐ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానమనే వెలుగులు నింపే వాడే గురువని సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయుల కీలక పాత్ర పోషిస్తారని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకోవడం ఎంతో అవసరం అని ఈ సందర్భంగా తెలిపారు.. అదేవిధంగా విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మీ జీవితాన్ని మీరు చేతులారా పోగొట్టుకోవద్దని ఈ సందర్భంగా తెలిపారు. విశాఖపట్నం ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.. తదుపరి ఎస్ఐ రాజు, ఏఎస్ఐ సత్యనారాయణకు రామ్ అకాడమీ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో ద్వారక ఏఎస్ఐ ఎం సత్యనారాయణ, విశాఖ సౌత్ టిడిపి ఇన్చార్జ్ సుధాకర్, 43 కార్పొరేటర్ ఉషశ్రీ, డాక్టర్ టి ఏ రాజు తదితరులు పాల్గొన్నారు..