పుట్టుక మాత్రమే మాది - మా శరీరంతో సహా జీవితమంతా ప్రజలదే అనే మనిషి సీతారాం ఏచూరి.
సీతారాం ఏచూరి జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ,ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకటరావు.
సీతారాం ఏచూరి విద్యా వ్యవస్థలో సామాజిక మార్పునకు విద్యార్థి నేతగా ఎనలేని కృషి చేశారని సీతారాం ఏచూరి జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకటరావు అన్నారు. నిరుపేదలకు, అణచివేతకు గురైన సామాజిక తరగతులకు కూడా ఉన్నత విద్యా అవకాశాలు హక్కుగా సిద్ధించాలని పరితపించి ఆ దిశగా పోరాడిన నవతారం నేత ఏచూరి అని కొనియాడారు. ఆయన మన తెలుగు వారు అవడం మన అదృష్టం.మనల్ని మనమే కొనుక్కుంటున్న గ్లోబలైజేషన్ కాలంలో మనల్ని మనకి మిగల్చడానికి యుద్ధం చేసి వెళ్లిపోయారు.ఆయన సోషలిస్ట్ ప్రపంచం కోసం కలలుగన్నారు. జీవితాంతం అందుకోసమే పని చేసి మేధావులకు, రాజకీయ నాయకులకు, ఆస్తికులకు, నాస్తికులకు కూడా గొప్ప స్ఫూర్తిగా నిలిచారు.పుట్టుక మాత్రమే మాది - మా శరీరంతో సహా జీవితమంతా ప్రజలదే అనే మనిషి సీతారాం ఏచూరి అని కొనియాడారు.ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నారు ఏచూరీ. ఢిల్లీ నుంచి వెలువడుతున్న హిందుస్థాన్ టైమ్స్ కు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరుతో చాలా ప్రముఖ వ్యాసాలు రాశారు. ఎల్కే అద్వానీ ఒకసారి పార్లమెంట్ లో నీ వలన చర్చల నాణ్యత పెరుగుతుంది అని కితాబు ఇచ్చారు.1996వ సంవత్సరంలో గవర్నమెంట్ లో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ చిదంబరంతో కలిసి ఆ పదవికి పూర్తి న్యాయం చేశారు. ఈ నవతరం విద్యార్థులు సీతారాం ఏచూరి నుంచి నేర్చుకోవాల్సింది అంబేద్కర్ చెప్పినట్లు చదువు - పోరాడు - సమీకరించు. అంబేద్కర్ చెప్పినట్లు సొసైటీని చదివి దేశ ప్రజల పరిస్థితి అర్థం చేసుకోవాలి.సొసైటీని మొత్తం మనం మార్చలేము గాని కొంతైనా మనకు చేతనైనంత చేయాలి అనే స్ఫూర్తితో ఏచూరి జీవితం అంత పోరాడారు.దేశ ప్రధాని దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, దేశంలో ఉన్న ప్రముఖ నవతరం నాయకులలో అందరికి సుపరీచితుడు, కడ వరకు ప్రజా గొంతుకుగా నిలిచిన సీతారాం ఏచూరి మన తెలుగువారైనందుకు నవతర నాయకుల్లో న్యాయమైన వ్యక్తిగా ఉన్నందున ఆయన జీవిత చరిత్రను తెలుగు పాఠ్యాంశంగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకటరావు కోరుతునట్లు తెలిపారు.