స్ఫుటo కప్స్ వివరాలు నమోదు

స్ఫుటo కప్స్ వివరాలు నమోదు - టి బి నోడల్ పర్సన్ జయప్రకాష్ 



రాజోలి మండల కేంద్రము లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు తెచ్చిన (స్పుటం కప్స్ ) గళ్ళ డబ్బాలు ను ప్రతి రోజూ (ఆర్ ఎన్ టి సి పి) రిజిష్టర్ లో నమోదు చేస్తామని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ అధికారి జయప్రకాశ్ తెలిపారు. ఏ ఎన్ ఎం లకు, ఆశా కార్యకర్తలకు కేటాయించిన దినం లలో ప్రతి సబ్ సెంటర్ నుండి గళ్ళ డబ్బాలను తీసుకొని రావాలి అని ఆయన అన్నారు, వారం రోజులుగా దగ్గు, జ్వరము,ఆయాసము, బరువు తగ్గడo, ఆకలి మందగించటం తదితర లక్షణాలు ఉన్న టిబి లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించి వారికి మాత్రమే గళ్ళ పరీక్ష లను చేయించాలని ఆయన చెప్పారు. ఆశా కార్యకర్తలు తెచ్చిన గళ్ళ డబ్బాలను రిజిష్టర్ లో నమోదు చేసి వాటిని టి హబ్ వాహనం లో జిల్లా కేంద్రము నకు తరలించడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రము లో ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షలు నిర్వహించిన తరువాత ఒకవేళ గళ్ళ పరీక్ష లో టిబి నిర్ధారణ అయితే వారికి టిబి మందులు 6 నెలల వరకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు, అందుకుగాను టిబి రోగి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు జిరాక్స్ కాపీ ఇవ్వాలని ఆయన అన్నారు. టిబి వచ్చినంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదని టిబి మందులు క్రమం తప్పకుండా వాడితే సరిపోతుందని, మందులతో పాటు పౌష్టిక ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటారని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ పర్సన్ జయప్రకాష్ తెలియజేశారు.