నిజాయితీగా తీసిన సినిమా ' మా నాన్న సూపర్ హీరో '

నిజాయితీగా తీసిన సినిమా  'మా నాన్న సూపర్ హీరో' - హిట్ అవ్వాలని దేవుణ్ణి కోరుతున్నా - హీరో సుధీ ర్ బాబు 



ద్వారకా నగర్ ( విశాఖ దక్షిణ): సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’ తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కాం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వీ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీమియర్ షో ద్వారకా నగర్ లో గల సంఘం థియేటర్లో ప్రదర్శించారు. ప్రేక్షకులతో కలిసి హీరో సుదీర్ బాబు సినిమా తిలకించారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు సినిమా విశేషాలని ప్రేక్షకులతో పంచుకున్నారు. 



ఆయన మాట్లాడుతూ, ఇద్దరు తండ్రులు- ఒక కొడుకు చుట్టూ తిరిగే కథ ఇది అన్నారు. తండ్రిని చూసుకోవడానికి కొడుకు పడే తపన లో చాలా కొత్త సిచువేషన్స్ ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అయ్యాయి. ఫాదర్ సన్ ఎమోషన్ ఆల్రెడీ ఉంది. అది జనాలకి గుర్తు చేస్తే చాలు. నాన్నని ప్రేమిస్తున్న కథ చెబుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్స్, కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ లోనే ఎస్టాబ్లిష్ అవుతాయి. దీన్ని ఇద్దరు ఫాదర్స్, ఒక కొడుకు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇది యూనివర్సల్ పాయింట్. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. తాను సుపర్ స్టార్ కృష్ణ ను ఈనాడు ఏమి కోరలేదు అని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ సినిమాని హిట్ చెయ్యాలి అని కృష్ణ, దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నారు. 



ఇది నిజాయితీ గా తీసిన సినిమా అన్నారు. హీరోయిన్ ఎక్సపో జింగ్, ఐటెం సాంగ్ తో కోట్లు ఖర్చు చేసి కొట్టే హిట్ కన్నా, అవేమీ లేకుండా హిట్ కొట్టడంలో కిక్ వుంటుంది అన్నారు. ప్రేక్షకు లు ఇంటికెళ్ళి అమ్మా నాన్నలు ను హగ్ చేసుకోవాలి అని కోరారు. ఈ సినిమాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అన్నారు. ఐ లవ్ యూ అంటూ ప్రేక్షకులను ఆయన ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా ఆయన హీరో కృష్ణ సీనియర్ అభిమానులను హగ్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పాల్గొన్నారు. పలువురు అభిమానులు ఆయనతో ఫోటోలు దిగారు.