దుర్గుణాలు అంతం చేసేదే విజయ దశమి

దుర్గుణాలు అంతం చేసేదే విజయ దశమి - బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధి రామేశ్వరి 



డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ప్రజాపితా బ్రహ్మాకు మారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విశాఖపట్నం సేవా కేంద్రాల ఆద్వర్యంలో డాబా గార్డెన్స్ లోని విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మహానవమి సందర్భంగా దసరా పండుగ సంబరాలు ఉత్సవం నిర్వహించారు. మీడియా సోదరీ సోదరులందరికీ వ విజయదశమి పండుగ యొక్క ఆధ్యాత్మిక రహస్యం సమాజ పరివర్తన కోసం విశేష కార్యక్రమాలను నిర్వహిస్తూ సందేశం ఇచ్చారు. 



వి జే ఎఫ్ మాజీ అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ, బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమక్షంలో పండగల వేడుకలు నిర్వహించి, విశిష్ఠత వివరిస్తారు అని గుర్తు చేశారు. విజయాలకు మారు పేరు విజయ దశమి అన్నారు. అజ్ఞాత వాసంలో వున్న పాండవులు జమ్మి చెట్టు మీద ఉంచిన ఆయుధాలకు పూజ చేసారు అన్నారు. బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధి రామేశ్వరి మాట్లాడుతూ, జర్నలిస్టులు, వారి కుటుంబాలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశంలో పండగలు ఆధ్యాత్మిక చిహ్నాలు అని అభివర్ణించారు. పండగల్లో భిన్నత్వం వుంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పండగలు దోహదం చేస్తాయి అన్నారు. పాండవులకు సద్గుణాలు వల్లనే విజయం దక్కింది. దుర్గుణాలు వల్లనే కౌరవులు ఓడి పోయారు అని గుర్తు చేశారు. మానవుడు ద్యానం, యోగ సాధన చేసుకోవాలి అన్నారు. ప్రపంచంలో మంచి కన్నా చెడే ఎక్కువగా వైరల్ అవుతుంది అన్నారు. మానవులు చెడు వైపే ఆకర్షితులవుతున్నారు అని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖ పాత్రికేయుల బృందం మౌంట్ అబూ యాత్రలో పాల్గొని, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అన్నారు. ధ్వని ద్వారా ఆత్మ జాగృతి అవుతుంది అన్నారు. దేశంలో పండగలు వల్లనే సనాతన ధర్మం కొనసాగుతుంది అన్నారు. మానవుల్లో పశు ప్రాయం అంతం చేయడానికే దుర్గాదేవి మహిషాసుర మర్ధిని అవతారం ఎత్తారు అన్నారు. పండగలు పేరిట జంతు హింస చేయడం హేయం అన్నారు. భక్తులు సత్సంప్రదాయలు కొనసాగించుకోవాలీ అన్నారు. దసరా నాడు శమీ వృక్ష పూజ ఎంతో విశిష్ఠత కలిగి ఉంటుంది అన్నారు. ఆయుధ పూజ ఆనవాయితీగా వస్తుంది అన్నారు. జీ వీ ఎం సి గాంధీ పార్కులో శనివారం సాయంత్రం 4 గంటలకు అష్ట శక్తులు గల దుర్గాదేవి చిత్ర పటం ఏర్పాటు చేసి, రావణ దహనం వేడుకలు జరుగుతాయి అన్నారు. దుర్గుణాలు పోవడానికి ఆత్మ శక్తి మేలు కోలపాలి అన్నారు. దుర్వ్యాసనాలు, దుర్గుణాలు అంతం చేసుకోవాలి అని కోరారు. 



వి జే ఎఫ్ మాజీ ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ, దుష్ట శక్తులు మీద మంచి సాధించిన విజయం చిహ్నం దసరా అన్నారు. రాజస్థాన్ మౌంట్ అబూ యాత్ర విశేషాలు ప్రపంచానికి యు ట్యూబ్ చానెల్ల ద్వారానే విస్తృత ప్రచారం జరిగింది అని కొనియాడారు. మీడియా సమావేశంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధులు సునీత, నారాయణ మూర్తి, కొండమ్మ, ఎం. పాపయమ్మ పాల్గొన్నారు.