గాజువాక విశాఖపట్నం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మడపాటి సమక్షం లో సోమవారం 10 మంది మహిళా కార్యకర్తలతో సింధియా 40 వ వార్డు పరిది ఏ కే సి కాలనీ కి చెందిన మేఘన దుర్గ ఆద్వర్యం లో బీజేపీ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం సింధియా 40 వ వార్డు ఏ కే సీ కాలనీ వార్డు అధ్యక్షురాలు గా మేఘనాదుర్గ నీ నియమించారు.
అనంతరం మేఘనదుర్గ మాట్లాడుతూ ప్రజల కోసం తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తనతో పాటు మహిళా కార్యకర్తలు కూడా సహాయం గా ఉంటానని తెలిపారు. సింధియా 40 వ వార్డు పరిది లో ఏ కే సీ కాలనీ లో బీజేపీ మహిళా కార్యకర్తలు మహాలక్ష్మి, నాగమణి, రత్నం, చిత్రప్రసన్న, స్వప్న, హేమలత, కనక, మహిళా కార్యకర్తలు గా పార్టీ లో చేరారు.