స్వయంపాలన ఆదివాసుల జన్మ హక్కు

కొమరం భీమ్ 123 వ జయంతి సందర్భంగా సీలేరులో కొమరం భీమ్ సొసైటీ సభ్యులు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు.



ఈ సందర్భంగా కొమరం భీమ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ కిల్లో మనోజ్ కుమార్ మాట్లాడుతూ జల్, జంగిల్, జమీన్ ఆదివాసుల సొంతమని, స్వయంపాలన ఆదివాసుల జన్మ హక్కు అని నాదంతో నాటి నైజాం ప్రభుత్వానికి సాయుధ పోరాటం చేసి జోడేన్ ఘాట్ కొండల్లో అమరుడైన భారత ఆదివాసి పోరాట యోధుడు గోండు బొబ్బిలి కొమరం భీమ్ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు కోడా ఆనంద్, సొసైటీ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.