దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు ను కలిసిన తిలక్

దీపావళి నేపథ్యంలో బాణసంచా విక్రయదారులు తప్పనిసరిగా అనుమతి లేకపోతే చర్యలు తప్పవని దువ్వాడ సిఐమల్లేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఏపీ జర్నలిస్ట్ ఫెడరేషన్ నగర ప్రధాన కార్యదర్శి, ది కన్జ్యూమర్ రైట్స్ ఫారం దక్షిణ భారత విభాగం సమన్వయకర్త ఎం వి ఎస్ జి తిలక్ సీఐ మల్లేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. 



ఈ సందర్భంగా తిలక్ సిఐ దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రాంతంలో పాటు, దువ్వాడ లో శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరచడానికి మల్లేశ్వరరావు సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గతంలో మల్లేశ్వరరావు టాస్క్ ఫోర్స్ లో విధులు నిర్వహించి తన ప్రతిభ చాటుకున్నారని అన్నారు. ఆయన ఎక్కడ విధులు నిర్వహించిన ఉన్నతాధికారులు, ప్రజలు ఆదరభిమానాలు పొందుతారని కొనియాడారు.