విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రరూపం..రైతు సంఘాల నేతలు హెచ్చరిక
విజయవాడ: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం తీవ్రతరమైందని ఏపి రైతు సంఘాలు రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణ చర్యలు నిలుపుదల చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఏపి రైతు సంఘాల సమన్వయ సమితి నేతృత్వంలో గురువారం నిరసన దీక్షలు ధర్నా చౌక్ లో జరిగాయి. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ 4300 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించటం ఏపాటి చర్యని, ఏందుకు సంకేతమని ప్రభుత్వాన్ని నిలధీశారు. కార్మికుల తిరుగుబాటు ఫలితంగా, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని మరల పాస్ లు జారీ చేశారన్నారు. ప్రైవేటీకరణకు ప్రభుత్వం తీసుకునే ఏటుంవంటి చర్యనైనా కార్మిక, కర్షక వర్గం తిప్పికొడతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఓబులేసు మాట్లాడుతూ ఇప్పటికే రెండు సెక్షన్లు మూసివేశారని, మూడోవది కూడా ఆ దిశగా పయనం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, బడా కార్పొరేట్ లకు కట్టబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని విమర్శించారు. దానిలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఈ రకమైన చర్యలకు పూనుకుందని దుయ్యబట్టారు.
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సీంగరావు మాట్లాడుతూ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్రలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందన్నారు. ప్రతిరోజు వేలాది మంది నిరసనలు వ్యక్తం చేస్తూ, వీధుల్లోకి ప్రజానీకం వస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ని శెల్ లో కలపాలని, సొంత గనులు, వనరులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, పురందేశ్వరీ తమ వాగ్దానాలని అమలు చేసి, తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఈ నిరసన దీక్షలలో ఏపి రైతు సంఘాల నాయకులు కెవివి ప్రసాద్ రావు, పి జమలయ్య, యలమందరావు, ప్రభాకర్ రెడ్డి, కృష్ణాయ్య, ఆంజనేయులు, సూర్యనారాయణ, హరినాధ్, వెంకట రెడ్డి, మరీదు ప్రసాద్ బాబు, వీరబాబు, విజయబాబు, కెవిపిఎస్ నాయకులు మాల్యద్రి తదితరులు పాల్లొన్నారు. చివరిగా ప్రపంచ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, యుద్ధం వద్దు, శాంతి ముద్దని, ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.