అనాధ శవానికి అంత్యక్రియలు

 


రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారిలో మృతి చెందిన అనాధ వ్యక్తికి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అంత్యక్రియలు నిర్వహించారు.



ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఈ అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. స్థానికులు తనకు ఇచ్చిన సమచారం మేరకు స్పందించడం జరిగిందన్నారు. అనంతరం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి తన సహాయం అవసరమో వారికి తన పరిధి మేరకు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు.