కర్నూల్ మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు భేటాయించిన సిఐటియు నాయకులు. క్లాప్ డ్రైవర్లు నాలుగు నెలల జీతం ఇవ్వాలని స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేసి ఇచ్చిన అధికారులకు చీమకుట్టినట్టు లేదనీ ధర్నా కు దిగారు.
తీర్మానం చేసి నెల అవుతున్న ఇంతవరకు క్లాప్ డ్రైవర్ల జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని సిఐటియు నాయకులు అన్నారు. క్లాప్ డ్రైవర్లకు ఇవ్వవలసిన పది నెలల జీతం ఇవ్వకపోగా స్టాండింగ్ కమిటీ నాలుగు నెలల జీతం ఇస్తామని తీర్మానం చేసిన అది ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
క్లాప్ కార్మికుల పరిస్థితి దీనంగా ఉంది ఒకవైపు కుటుంబ సమస్యలు, మరోవైపు వారి పిల్లల స్కూల్ ఫీజులు ఇవి కట్టుకోలేక అప్పుల పాలవుతున్నారు అని వాపోయారు.