అత్యాచారం చేసి హత్య నిందితుడిని శిక్షించాలి.

అశ్విని అనే విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు సన్నీ ని తక్షణమే అరెస్టు చేయాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. 



ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అశ్వినిపై జరిగిన అత్యాచార హత్య ఘటన భాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హింసను అరికట్టే చర్యల్లో పోలీసు యంత్రాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని ఆమె తెలిపారు.అత్యాచార హత్య నిందితుడు సన్నీ ని తక్షణమే అరెస్టు చేసి, ఫాస్టు ట్రాక్ కోర్టు ద్వారా మూడు నెలల్లో కేసు విచారణ జరిపి నిందితుడ్ని చట్టప్రకారం శిక్షించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.