ఈరోజు బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామంలో శ్రీశ్రీశ్రీ దేవి నవరాత్రుల 26వ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి అంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో విచ్చేసారు.
దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మరిశా సతీష్, మరిశా నరేష్, నాగులాపల్లి సత్యనారయణ, షేక్ వల్లి, కంచిపాటి శ్రీనివాసరావు తదితర నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.