రోడ్డు కావాలంటే కోర్టుకు పోవాలి

రోడ్డు కావాలంటే కోర్టుకు పోవాలి... రోడ్డును ఆక్రమించిన తలారి కుటుంబ సభ్యులు... రోడ్డు కావాలని అడిగినందుకు పర్మనెంట్ ఇంజక్షన్ నోటీసులు...రోడ్డు కోసం తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన దేవదాసి మహిళలు- న్యాయం న్యూస్,హొళగుంద, పంచకుండుగా వెంకటేష్..



మేజర్ గ్రామపంచాయతీ హోలగుందలోని సర్వే నంబర్ 382 /A ఎస్సీ కాలనీలో ప్రభుత్వం పేదలకు పంచిన లేఅవుట్ ప్లాట్ల మధ్యలో ఉన్న రోడ్డును ఆక్రమించి, రస్తా వదలాలని అడిగినందుకు హోలగుంద రెవెన్యూ కార్యాలయంలో తలారి గా పని చేస్తున్నటువంటి నరసమ్మ కుటుంబ సభ్యులు పర్మనెంట్ ఇంజక్షన్ కోరుతూ కోర్టుకు వెళ్లారని ప్రభుత్వం లేఅవుట్ నందు చూపిన విధంగా రస్తాను గుర్తించి హద్దులు చూపించి కోర్టుకు నివేదించడానికి రిపోర్టును ఇవ్వాలని కోరుతూ దేవదాసి కాలనీ మహిళలు ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు డిప్యూటీ తహసిల్దార్ నిజాముద్దీన్ కు వినతి పత్రాన్ని అందించి సమస్యను వివరించారు. 



ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీకి ఎస్సీ కాలనీలో నుంచి తిరగడానికి అనుకూలంగా ఉన్న రస్తా అని అయితే తాసిల్దార్ కార్యాలయంలో తలారిగా పని చేస్తున్న నరసమ్మ కుటుంబ సభ్యులు రోడ్డుకు అడ్డంగా కర్రలు రాళ్లు గరుసువేసి రోడ్డును మూసివేసి కబ్జా చేసి ఆక్రమించడానికి ప్రయత్నం చేశారని అయితే దీనిపై ఎస్సీ కాలనీ ప్రజలు దేవదాసి కాలనీ మహిళలు గతంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో పాటు రోడ్డుపై రాస్తారోకో చేశారని అప్పటి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్ది చెప్పడంతో ధర్నాను విరమించి కొద్దిపాటి రస్తా లో తిరుగుతున్నామని అయితే ప్రస్థానం పూర్తిగా ఆక్రమించే దురుద్దేశంతో వారి ప్లాట్ లోకి అక్రమంగా దౌర్జన్యంతో ప్రవేశిస్తున్నట్లు కోర్టు వారిని తప్పు దావ పట్టిస్తూ రోడ్డును ప్లాటుగా చూపించి పర్మనెంట్ ఇంజక్షన్ కోరారని దీనివల్ల పలువురికి కోర్టు నుంచి సమన్లు వచ్చాయని తెలిపారు. 



పబ్లిక్ రోడ్డును ప్రైవేట్ స్థలంగా తమ సొంత స్థలంగా చూపిస్తూ రోడ్డు కోసం అడిగిన వారిపై కోర్టుకు వెళ్లి వారిని దోషులుగా చూపిస్తూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు తిరగడానికి ఉపయోగించే రోడ్డుకు అడ్డంగా రాళ్లు కర్రలు వేసి రోడ్డును మూసివేసారని కాబట్టి అధికారులు ప్రజలకు అవసరమైన ఈ రోడ్డును పరిశీలించి సర్వేయర్ ద్వారా కొలతలు వేయించి లేఅవుట్ ప్రకారంగా అక్కడ ఉన్న రోడ్డుని ధృవీకరించి ధ్రువీకరించి ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన డిప్యూటీ తాసిల్దార్ నిజాముద్దీన్ మాట్లాడుతూ పబ్లిక్ రోడ్డు ఆక్రమించడం నేరమని, సర్వే యర్ ద్వారా కొలత వేయించి లేఔట్ నందు వదిలిన రోడ్డును ధ్రువీకరిస్తామని అదేవిధంగా ప్రజలు తిరుగుతున్న రోడ్డును అడ్డుకో రాదని వారు కోరుతున్న విధంగా సర్వే ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పత్తికొండ డివిజన్ ఉపాధ్యక్షులు పంచగుండగ వెంకటేష్, నాయకులు కన్నారావు, సినిమా మంగన్న, మృత్యుంజయ, వార్డ్ మెంబర్ వీరేష్, రుతి , శివి, లక్ష్మప్ప తదితరులు పాల్గొన్నారు.