గోదావరి నూతన కార్యాలయం ప్రారంభం

  


గ్రామీణ జన జీవన తేజం 'గోదావరి' దినపత్రిక అమలాపురం ఎడిషన్ నూతన కార్యాలయం శనివారం రాత్రి 7.29 గంటలకు ప్రారంభమైంది. 



అమలాపురం గొల్లగూడెం రామకృష్ణా వీధిలో గోదావరి దినపత్రిక నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు. 



ప్రముఖ వేద పండితులు ఉపద్రష్ట విజయాదిత్య గోదావరి ఎడిటర్ అండ్ పబ్లిషర్ బోళ్ళ సతీష్ బాబుతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 



ప్రముఖ న్యాయవాది చిట్టిమేను వీర సూర్యనారాయణ (సురేష్), టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పెద్దాపురం నియోజకవర్గ టిడిపి పరిశీలకులు బోళ్ళ వెంకటరమణ, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్, టిడిపి నాయకులు డాక్టర్ తాడి మోహన్ బాబు, ప్రముఖ వాస్తు పండితులు ఉపద్రష్ట నాగార్జున, ప్రముఖ కవి మాకే బాలార్జున సత్యనారాయణ, గోదావరి అమలాపురం ఎడిషన్ ఇంఛార్జి బొమ్మిడి హరిబాబు, సబ్ ఎడిటర్ చప్పిడి సుబ్రహ్మణ్యం, గోదావరి విలేఖరులు పెంటపాటి శ్రీనివాస్, కారుపల్లి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.