ఇద్దరు అంతరాష్ట్ర నేరస్థుల అరెస్టు



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలంలో ఈరోజు ఉదయం అశ్వరావుపేట సిఐ, అశ్వరావుపేటఎస్సై, దమ్మపేట ఎస్సై మరియు వారి సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెం హైవే రోడ్డు నందు గల సాయిబాబా టెంపుల్ ఎదురుగా వాహన తనిఖీలు చేయుచుండగా ఒక నీలం రంగు గల హోండా యాక్టివా వాహనం మీద జంగారెడ్డిగూడెం వైపు వెళుతున్న ఇద్దరు మగ వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించుచుండగా, సిఐ వారికి ఇబ్బందితో వెంబడించి వారిని పట్టుకుని విచారించగా వారు ఇదివరకు చాలా దొంగతనం, Robbery and Murder for gain కేసులలో నిందితులుగా అరెస్టు కాబడినట్లు గుర్తించి, వారిని విచారించగా క్రింది విధంగా తెలిపినారు.



A-1 Bachu Satheesh S/o Bala chandrudu, 48 yrs, Kaapu,R/o Ramachandrapuram Village, Avanigadda Mandal, Krishna Dist, AP, 

A-2ArempulaDarmaraju, S/o Jamalaiah, 45yrs, Madiga, R/o Moddulaparwa Village, Reddygudem Mandal, NTR Dist, AP.

మీరు ఇరువురిపై సత్తుపల్లి, వేంసూర్, చాట్రాయి, విస్సన్నపేట, రేపల్లె, నూజివీడు, మైలవరం, అవనిగడ్డ మరియు దమ్మపేట మండలాలలో అనేక రాబరీ దొంగతనం కేసులు ఉన్నాయి. వీరు చాట్రాయి మండలంలో డబ్బుల కోసం ఒక వ్యక్తిని చంపి పారిపోయినారు. వీరు ఆ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పైన బయటికి వచ్చారు. వీరు ఇద్దరూ ఆంధ్రలో కాకుండా తెలంగాణ బోర్డర్ ప్రాంతంలో దొంగతనం చేస్తే ఎవరికి తెలియదనే ఉద్దేశంతో ఫిబ్రవరి నెలలో 15వ తారీఖున మందలపల్లి సెంటర్ కి దగ్గరలో ఉన్న ఒక దాబాలో ఒక ముసలమ్మ మెడలో ఒక నాను తాడును చూసి దానిని ఎలాగైనా దొంగలించాలనే ఉద్దేశంతో, రాత్రి వాళ్లు పడుకున్న తర్వాత ఇద్దరు వచ్చి వారిపై దాడి చేసి మూడు తులాల బరువు కలిగిన బంగారు నానుతాడును లాక్కొని పారిపోయినారు. ఆ తర్వాత మళ్లీ దమ్మపేట మండలంలో SBI Bank లో నుండి 40 వేల రూపాయలు విత్ డ్రా చేసుకొని వస్తున్న ఒక వ్యక్తి నుండి 40 వేల రూపాయలు ఉన్న బ్యాగ్ ని దొంగలించుకుని వెళ్లారు. మళ్లీ సెప్టెంబర్ నెల 10వ తేదీ న నారం వారి గూడెం సెంటర్లో ఉన్న ఒక షాప్ లో ఉన్న ఒక మహిళ మెడలో నాను తాడు ఉండడం గమనించి దానిని ఎలాగైనా దొంగలించాలని, అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో ఆ ఇంటి వ్యక్తి బాత్రూం కి వెళ్ళు నిమిత్తం తలుపు తీయగా, వీరిద్దరూ ముందుగా తెచ్చుకొని ఉన్న జామాయిల్ కర్రతో అతనిపై దాడి చేసి, ఆయన భార్య మెడలో ఉన్న నానుతాడును దొంగిలించుకుని పోవు క్రమంలో ఆమె నాను త్రాడుని గట్టిగా పట్టుకోవడం వల్ల 18 గ్రాముల బంగారం గొలుసు ముక్కని దొంగిలించుకొని పారిపోయినారు.

పై ఇరువురు వ్యక్తులు పై నేరములను అంగీకరించగా, వారి వద్ద నుంచి మూడు తులాల బరువు కలిగిన బంగారు నానుతాడు, రెండు మంగళ సూత్రాలు మరియుకరిగించిన 18 గ్రాముల బంగారం కడ్డీ, నారం వారి గూడెం లో నేరం చేసే క్రమంలో వ్యక్తిని కొట్టిన కర్ర, టార్చ్ లైట్, రెండు మంకీ క్యాపులు, హ్యాండ్ గ్లౌజులు, హోండా యాక్టివా బండి, ఒక సెల్ ఫోను ను స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరిద్దరిని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరు పరచడం జరుగుతుంది.

వీరు ఇద్దరి పైన వున్న కేసు ల వివరాలు: 

1)Cr.No 23/ 2007 Us 392 IPC Of Sathupally Ps

2)Cr.No 24/ 2007 Us 392 IPC Of Sathupally Ps

3) Cr.No 06/ 2007 Us 302 , 394 IPC Of Chatrai Ps

4) Cr. No .04/2007 US 392 IPC Of Vemsoor PS

5)Cr.No:03/2007 Us 392 IPC of Vemsoor Ps.

6)Cr.No:74/2007 Us 457 ,380 IPC of Chatrai PS

7) Cr.No: 76/2007 us 379 IPC of Chatrai PS

8) Cr.No:61/2007 Us 392 IPC Of Avanigadda PS.

9)Cr.No:388/2007 US 394 IPC of Repalli PS

10)Cr.No:143/2007 Us 394 IPC of Vissanapeta PS.

11) Cr.No:99/2010 us 379 IPC of Nuzuveedu Town PS.

12) Cr.No:109/2008 Us 394 IPC of Dammapet PS.

13)Cr.No .41 / 2024 US380 IPC of Dammapet PS.

14)Cr.No: 221 /2024 Us 309(6) , 331(6) of BNS of Aswaraopet PS

15)Cr.No .60/ 2024 US 420,379 IPC of Dammapet PS.