విజయవాడ బుడమేరు వారియర్స్ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా బుడమేరు వారియర్స్ కి ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా నగర మేయర్ భాగ్యలక్ష్మి మాజీ మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా బుడమేరు వాగు ప్రవహించడం ప్రజల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆస్తి నష్టం జరిగినదని అలాంటి సమయంలో గౌరవ డాక్టరేట్ అవార్డు డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు బుడమేరు వరద బాధితుల కొరకు ఆహారం, వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, దుస్తులు వరద తీవ్రత తగ్గేవరకు అందించారు. డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు అనేక విశిష్ట సేవలు అందించి ఉన్నారని అందరికీ ఆదర్శంగా సహాయ సహకారాలు అందించారని డాక్టర్ శ్రావణ్ కుమార్ కొనియాడారు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులకు గౌరవించడం సన్మానించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. సన్మానం అనంతరం డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ పేద ప్రజలకు సహాయం అందించిన వరద బాధితులకు సహాయ సహకారాలు అందించిన మాకు గుర్తు పెట్టుకుని సన్మానించడం ఎంతో ఆనందదాయకం ఆని కొనియాడారు. ఈ గౌరవ మర్యాదలు ఈ విశిష్ట సత్కారం డాక్టర్ శ్రావణ్ కుమార్ అందజేసి నందుకు ధన్యవాదములు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని అందరికీ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆదర్శమని కొనియాడారు.